![]() |
![]() |

బాస్ ప్రేక్షకులను ఎంటర్టైన్ చెయ్యడానికి ఈ సీజన్ సరికొత్తగా ప్రేక్షకుల ముందుకు రానుంది. టెలివిజన్ చరిత్రలో వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్. గత కొన్ని సంవత్సరాలగా టెలివిజన్ లో ఒక ట్రెండ్ క్రియేట్ చేస్తూ విజయవంతంగా దూసుకుపోతుంది. టీఆర్పీలో అత్యధిక రేటింగ్ తో ఎంటర్టైన్మెంట్ కి కేరాఫ్ అడ్డాగా మారింది బిగ్ బాస్.
ఈ సీజన్ కి సంబంధించిన సెట్ పనులు, ఇంకా ప్రోమో షూట్ అంతా ఇప్పటికే మొదలైనట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. బిగ్ బాస్ టీమ్ కంటెస్టెంట్స్ ని అప్రోచ్ అవడం కూడా జరిగిందంట. అందులో కొంతమందిని కన్ఫర్మ్ చెయ్యడం, వాళ్ళతో అగ్రిమెంట్ పూర్తిచేసినట్టుగా తెలుస్తుంది. ప్రతి కేటగిరి నుండి ఒకరిని సెలెక్ట్ చేస్తూ జరిగే ఈ ప్రక్రియలో.. ఒక రియల్ కపుల్ ని తీసుకుంటున్నారంటూ తెలుస్తుంది. గత సీజన్ కి అవుటింగ్ ఇంటర్వ్యూ చేసిన యాంకర్ శివ ఈ సారి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. బిగ్ బాస్ సీజన్-7కి బిబి కేఫ్ యాంకర్ గా అరియాన గ్లోరీ వ్యవహరిస్తుందంట. బిగ్ బాస్ సీజన్-7 కి సంబంధించిన ప్రోమో షూటింగ్ ఈ నెల ఆఖరున మొదలవుతున్నట్లు సమాచారం.
బిగ్ బాస్ సీజన్-7కి సంబంధించిన చాలా అనుమానాలు ప్రేక్షకులలో ఉన్నాయి. బిగ్ బాస్ ప్రేక్షకులకు ఎప్పుడు ఎప్పుడు బిగ్ బాస్ స్టార్ట్ చేస్తారా అనే క్యూరియాసిటి రోజు రోజుకి పెరిగిపోతుంది. అయితే అందరిలో ఉన్న సస్పెన్స్ కి తెరతీస్తూ స్టార్ మా ప్రతిష్టాత్మకంగా బిగ్ బాస్ లోగోని విడుదల చేసింది. ఇప్పటికే నాగార్జునకి సంబందించిన రెండు ప్రోమోలని విడుదల చేయగా.. ఈ సారి సీజన్ కొత్తగా, మునుపెన్నడు లేని విధంగా ఉంటుందని నాగార్జున మాటలని బట్టి తెలుస్తుంది. తాజాగా విడుదల చేసిన ప్రోమో లో అన్ని క్లైమాక్స్ లలో లాగా కాకుండా ఈ సారి ఎండింగ్ నే మార్చేద్దామంటూ నాగార్జున అన్నాడు. ఇది అంతం కాదు ఆరంభం మాత్రమే.. ఈ సారి మొత్తం ఉల్టా పుల్టా అని ప్రోమోలో నాగార్జున చెప్పుకొచ్చాడు. దీంతో బిగ్ బాస్ సీజన్-7 పై ప్రేక్షకులలో మరింత క్కూరియాసిటి పెరిగింది.
![]() |
![]() |